: అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతి
అనంతపురం జిల్లా గుంతకల్లులో ఈ రోజు సాయంత్రం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అక్కడి ఎర్రతిమ్మరాజు చెరువు గుండా తెప్ప వెళుతుండగా ఒక్కసారిగా అది బోల్తా పడింది. ఆ సమయంలో అందులో మొత్తం 19 మంది ఉండగా అందులో తొమ్మిది మంది మృతి చెందారు. మిగతా వారంతా గల్లంతయ్యారు. మృతుల్లో ఆరుగురు మహిళలే ఉన్నారు. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది గల్లంతైన వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తోంది. మృతులు, గల్లైంతైన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. సామర్థ్యానికి మించి పడవలో ఎక్కడంతోనే తెప్ప తిరగబడి ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.