: సీఆర్పీఎఫ్ జవాన్ రైఫిల్ ను దొంగిలించబోయి పట్టుబడ్డ తీవ్రవాది!


జమ్మూకాశ్మీర్ లోని అనంత్ నాగ్ లో ఓ తీవ్రవాదిని సీఆర్పీఎఫ్ జవాన్లు అరెస్టు చేశారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, అనంత్ నాగ్ ప్రధాన టౌన్ లోకి చొరబడేందుకు ఇద్దరు తీవ్రవాదులు యత్నించారు. ఈ క్రమంలో ఓ భద్రతా సిబ్బంది తుపాకీని తస్కరించేందుకు ఒక తీవ్రవాది యత్నించినట్టు పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ నేపథ్యంలో జవాన్ గాయపడినట్టు సమాచారం. ఆ తీవ్రవాదిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇతను కుల్గాం జిల్లాకు చెందిన వ్యక్తిగా పోలీసులు భావిస్తున్నారు. జవాన్ల చేతికి చిక్కకుండా మరో తీవ్రవాది తప్పించుకు పారిపోయాడు.

  • Loading...

More Telugu News