: ఇప్పుడు తెలుసుకోవాల్సింది కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడని కాదు: కల్యాణ్ రామ్


భారీ బడ్జెట్‌తో ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన బాహుబ‌లి సినిమాపై సినీతార‌లు, ప్రేక్ష‌కుల నుంచి ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది. బాహుబలి దర్శకుడి నుంచి టెక్నీషియన్స్ వరకు ప్రతి ఒక్క‌రు కనబరిచిన ప్రతిభ‌ను అభినందించ‌కుండా ఉండ‌లేక‌పోతున్నారు. తాజాగా, టాలీవుడ్ న‌టుడు నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ కూడా బాహుబలి టీమ్‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించాడు.

 ఇక ఇప్పుడు తెలుసుకోవాల్సింది బాహుబలిని క‌ట్ట‌ప్ప‌ ఎందుకు చంపాడని కాదని త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పేర్కొన్న ఆయ‌న‌... అసలు 'బాహుబలి-2'ని ఇంత గొప్పగా ద‌ర్శ‌కుడు రాజమౌళి ఎలా తెరకెక్కించారో తెలుసుకోవాలని పేర్కొన్నాడు. బాహుబ‌లి-2 లో ప్రభాస్ పాత్ర అద్భుతంగా ఉంద‌ని, రానా దగ్గుబాటి కూడా అద‌ర‌గొట్టేశాడ‌ని క‌ల్యాణ్ రామ్‌ వ‌రుస ట్వీట్లు చేశాడు. ఈ సినిమాలో అనుష్క, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్.. ఇలా అంద‌రూ అద్భుతంగా న‌టించార‌ని ఆయ‌న కొనియాడాడు. ఈ సినిమాకు ఎంఎం కీరవాణి అందించిన బ్రిలియంట్ బ్యాగ్రౌండ్ స్కోర్ సూపర్ అని ఆయ‌న ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నాడు.









  • Loading...

More Telugu News