: సూర్యాపేట మార్కెట్ యార్డుకు చేరుకున్న కోదండరాం.. హోరాహోరీ నినాదాలతో ఉద్రిక్తత
సూర్యాపేట మార్కెట్ యార్డులో ఈ రోజు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ మార్కెట్లో గిట్టుబాటు ధర లేదంటూ రైతులు తెలుపుతున్న ఆందోళనకు టీజేఏసీ ఛైర్మన్ ప్రొ.కోదండరాం మద్దతు తెలిపారు. ఈ రోజు ఆ మార్కెట్‌కు ఆయన టీజేఏసీ కార్యకర్తలతో కలిసి చేరుకున్నారు. ఆయన మార్కెట్ యార్డును సందర్శిస్తుండగా అక్కడి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కోదండరాంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో కోదండరాం మద్దతుదారులు కూడా నినాదాలు చేయడంతో పోటాపోటీ నినాదాలతో సూర్యాపేట మార్కెట్ యార్డు హోరెత్తిపోయింది. మరోవైపు రాష్ట్రంలో మిర్చిరైతుల ఆందోళనపై స్పందించిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మిర్చి ధరను ప్రభుత్వం నిర్ణయించదని అన్నారు. రైతులు ఆందోళన చెందవద్దని సర్కారు రైతుల పక్షానే ఉందని అన్నారు.