: ‘కోకోకోలా’లో అత్యున్నత స్థాయ ఉద్యోగుల మార్పు!


ప్రముఖ శీతల పానీయాల సంస్థ ‘కోకోకోలా’ అత్యున్నత స్థాయి ఉద్యోగుల మార్పునకు శ్రీకారం చుట్టింది. భారతదేశ ‘కోకోకోలా’ విభాగం అధ్యక్షుడు వెంకటేష్ కిని స్థానే కొత్తగా టి.కె.కె. కృష్ణకుమార్ ను నియమించినట్టు ఈ మేరకు సంస్థ ప్రకటించింది. కాగా, అమెరికాలోని ఓ సంస్థకు వెంకటేష్ కినిని బదిలీ చేశారు. కొత్తగా నియమితులైన కృష్ణకుమార్ ప్రస్తుతం కోకోకోలా సౌత్ వెస్ట్ ఆసియా ప్రాంతం డైరెక్టర్ గా ఉన్నారు. ఇక ఈయన స్థానంలో వియత్నాం, మయన్మార్, కంబోడియా ప్రాంతీయ డైరెక్టర్ గా ఉన్న వంశీమోహన్ ను నియమించినట్టు ఆ ప్రకటనలో తెలిపారు.

  • Loading...

More Telugu News