: దినకరన్ కేసులో శశికళ విచారణ?
ఏఐఏడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్ కేసులో ఆ పార్టీ చీఫ్ శశికళను కూడా విచారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. బెంగళూరులోని పరప్పన కేంద్ర కారాగారంలో ఉన్న శశికళను ఈ కేసులో విచారించాలని ఢిల్లీ పోలీసులు ఇప్పటికే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. దినకరన్ ను కాపాడేందుకు తమిళనాడుకు చెందిన ముగ్గురు ఐపీఎస్ అధికారులు ప్రయత్నించినట్టు ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు గుర్తించారు. సుఖేష్ ఢిల్లీలో అరెస్టైన తర్వాత ఈ ముగ్గురు అధికారులతో దినకరన్ ఫోన్ లో చర్చించినట్టు సమాచారం.