: బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తెలిసిపోయింది: మంచు లక్ష్మి సంబరం


'బాహుబలి: ది కంక్లూజన్' సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సినీ అభిమానుల‌ను అల‌రిస్తోన్న విష‌యం తెలిసిందే. ఎంతో మంది సినీ ప్ర‌ముఖులు కూడా ఈ సినిమాను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. తాను ఆరాధించే బాహుబ‌లిని క‌ట్ట‌ప్ప ఎందుకు చంపాడ‌న్న ర‌హ‌స్యం తెలిసిపోయిందంటూ సెల‌బ్రిటీలు సైతం హ‌ర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ సినిమాని చూసిన న‌టి, నిర్మాత‌ మంచు లక్ష్మి ఎంతో సంతోషాన్ని వ్య‌క్తం చేస్తూ.. త‌న గ్యాంగ్‌తో క‌లిసి మొద‌టి రోజు మొద‌టి ఆట బాహుబ‌లి-2 చూశాన‌ని చెప్పి, ట్విట్ట‌ర్‌లో ఓ ఫొటోను పోస్ట్ చేసింది. అందులో అడవి శేషు, రకుల్ ప్రీత్ సింగ్, రెజీనా, సుశాంత్ తదితరులు ఉన్నారు. ఫైన‌ల్‌గా బాహుబ‌లిని కట్టప్ప ఎందుకు చంపాడో తెలిసిపోయిందని మంచు లక్ష్మి సంబ‌ర‌ప‌డిపోయింది.


  • Loading...

More Telugu News