: ప్రభుత్వ కార్యాలయాల ల్యాండ్‌లైన్‌ ఫోన్లకు ఏ సమయంలోనైనా ఫోన్‌ చేస్తా!: యూపీ సీఎం హెచ్చరిక


ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది మొదలు దూకుడుగా పలు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళుతున్న యోగి ఆదిత్య‌నాథ్ ప్ర‌భుత్వాధికారుల్లో ఉన్న అల‌స‌త్వాన్ని వ‌దిలించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. యూపీలో శాంతి భద్రతలను గాడిలో పెట్టేందుకు ఉద్యోగులంతా కష్టపడి పనిచేయాలని సూచ‌న‌లు చేశారు. వారు విధులు నిర్వ‌ర్తిస్తోన్న తీరును తెలుసుకునేందుకు మ‌రో ఉపాయం ఆలోచించారు. త‌మ రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల ల్యాండ్‌లైన్‌ ఫోన్లకు తాను ఏ స‌మ‌యంలోనైనా ఫోన్లు చేస్తాన‌ని చెప్పారు.

ఆ రాష్ట్ర మంత్రి శ్రీకాంత్‌ శర్మ ఈ విష‌యంపై మాట్లాడుతూ... ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు ఏ సమయంలోనైనా సీఎం నుంచి ఫోను రావ‌చ్చ‌ని, ఆ ఫోన్‌కు స‌మాధానం ఇవ్వ‌కపోతే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. ఫీల్డ్‌ వర్క్‌లో ఉండే ఉద్యోగులకు మాత్రమే ఇందులో మిన‌హాయింపు ఉంటుంద‌ని, తనిఖీలు, సూపర్‌వైజింగ్‌ పనిలో ఉండే సీనియర్‌ పోలీసు అధికారులను కూడా మిన‌హాయిస్తున్నామ‌ని అన్నారు.

  • Loading...

More Telugu News