: 'బాహుబలి-2'పై జూనియర్ ఎన్టీఆర్ స్పందన
'బాహుబలి-2' సినిమా అఖండ విజయం సాధించడం పట్ల సినీ ప్రముఖులు నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. ముఖ్యంగా రాజమౌళితో కలసి హ్యాట్రిక్ హిట్ కొట్టిన జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాను ఆకాశానికెత్తేశాడు. ఇది కేవలం తెలుగు సినిమా మాత్రమే కాదని... భారతీయ సినిమా ఖ్యాతిని సరికొత్త ఎత్తులకు తీసుకెళ్లిన గొప్ప చిత్రమని కితాబిచ్చాడు. రాజమౌళి కల నిజరూపం దాల్చేందుకు సహకరించిన శోభు, ప్రసాద్, నటీనటులు, టెక్నీషియన్స్ కు ధన్యవాదాలు తెలిపాడు. అద్భుత నటనతో సినిమాకు ప్రాణం పోసిన ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణలకు హ్యాట్సాఫ్ చెప్పాడు.