: సీబీఐ కోర్టుకు జగన్... వైసీపీ శ్రేణుల్లో నరాలు తెగే ఉత్కంఠ!
హైదరాబాదులోని సీబీఐ కోర్టుకు వైసీపీ అధినేత జగన్ హాజరయ్యారు. అక్రమాస్తుల కేసులో సాక్షులను ప్రభావితం చేస్తున్నారన్న నేపథ్యంలో జగన్ బెయిల్ ను రద్దు చేయాలంటూ సీబీఐ వేసిన ఛార్జ్ షీట్ పై నేడు కోర్టు కీలక తీర్పును వెలువరించనుంది. ఈ నేపథ్యంలో, వైసీపీ శ్రేణుల్లో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. కోర్టు తీర్పు ఎలా వెలువడబోతోందో అనే టెన్షన్ అలముకుంది. జగన్ మళ్లీ జైలుకు వెళ్లే పరిస్థితి వస్తే... ఏం చేయాలన్న భయం వారిలో నెలకొంది. ఈ నెల 7, 21 తేదీల్లో ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు... తీర్పును నేటికి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో, జగన్ కు బెయిలా? జైలా? అనే విషయం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల్లోపు తేలిపోబోతోంది. అంతవరకు జగన్ కోర్టులోనే ఉండే అవకాశం కనిపిస్తోంది.