: 'బుక్ మై షో' ఘరానా మోసం.. లబోదిబోమంటున్న 'బాహుబలి' అభిమానులు


ప్రముఖ ఆన్ లైన్ సినిమా టికెట్స్ బుకింగ్ సంస్థ 'బుక్ మై షో' ఘరానా మోసానికి పాల్పడింది. చెన్నైలో 'బాహుబలి-2' సినిమాకు సంబంధించి అనుమతి లేని షోలకు కూడా ఒక్కో టికెట్ ను రు. 500కు అమ్మింది. వాస్తవానికి ఈ టికెట్ ధర రూ. 125 మాత్రమే. టికెట్లు తీసుకుని సినిమా చూద్దామని థియేటర్లకు ఆత్రుతతో వెళ్లిన అభిమానులకు షాక్ తగిలింది. టికెట్లు చెల్లవని థియేటర్ యాజమాన్యాలు చెప్పడంతో వీరు అవాక్కయ్యారు. థియేటర్ల వద్దే ఆందోళనకు దిగారు.

ఈ విషయం గురించి బుక్ మై షోకు ఫోన్ చేసి అడిగితే... కేవలం రూ. 100 మాత్రమే వెనక్కి ఇస్తామని చెబుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. రూ. 500 వసూలు చేసి, ఇప్పుడేమో ఇంత తక్కువ మొత్తం ఇస్తామని చెబుతున్నారని మండిపడ్డారు. మరోవైపు, ఆందోళన చేస్తున్న బాధితులను చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకుని, జీపుల్లో అక్కడ నుంచి తరలిస్తున్నారు. 

  • Loading...

More Telugu News