: 'బాహుబలి-2: ద కన్ క్లూజన్' సినిమా చూసిన అభిమానుల స్పందన ఇదే!
'బాహుబలి-2: ద కన్ క్లూజన్' కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన అభిమానులు బెనిఫిట్ షో చూసేశారు. ఇంతవరకు ఈ చిత్ర యూనిట్ చెప్పిన మాటలు ఆసక్తిగా విన్న అభిమానులు దీనిపై స్పందించారు. సినిమా బాగుందని చెప్పారు. తొలి భాగం కంటే 'బాహుబలి-2: ద కన్ క్లూజన్' ఎంతో బాగుందని అంటున్నారు. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని తెలిపారు. పాటలు బాహుబలి 1 అంతటి స్థాయిలో వీనుల విందుగా లేకున్నప్పటికీ, విజువల్స్ పరంగా అద్భుతంగా ఉన్నాయని చెప్పారు.
తొలి భాగంలో అనుష్క డీ గ్లామర్ గా కనిపిస్తే, రెండో భాగంలో యువరాణిగా బాగుందని కితాబునిచ్చారు. రాక్షసుడిగా భల్లాల దేవుడు భయపెడితే... యువరాజుగా మహేంద్ర బాహుబలి ఆకట్టుకున్నాడని వారు చెబుతున్నారు. తొలి భాగం కంటే విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయని, రెండు భారీ ఫైట్లు సినిమాకు ఆకర్షణ అని, ప్రభాస్, రానా పోటీ పడి నటించారని ఈ సినిమా చూసిన అభిమానులు చెబుతున్నారు.