: అంతర్జాతీయ స్థాయి సినిమా అని గర్వంగా చెప్పుకోవచ్చు: కృష్ణంరాజు
'బాహుబలి-2: ద కన్ క్లూజన్' అద్భుతంగా ఉందని ప్రముఖ సీనియర్ సినీ నటుడు, ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు ప్రశంసించారు. బెనిఫిట్ షో చూసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, అభిమానులు ఆనందంగా ఉన్నారని అన్నారు. ఈ సినిమాలో ప్రతి ఫ్రేమ్ కనులకింపుగా ఉందని అన్నారు. తెలుగు సినిమా చరిత్రగతిని మార్చిన సినిమాగా, భారతీయ సినిమా స్థాయిని పెంచిన సినిమాగా బాహుబలిని పేర్కొనవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. సినిమా పట్ల సంతృప్తికరంగా ఉన్నామని ఆయన తెలిపారు. రాజమౌళి అంతర్జాతీయ స్థాయి విలువలతో ఈ సినిమాను రూపొందించాడని ఆయన పేర్కొన్నారు. సినిమా సూపర్ హిట్ అని ముందే తమకు తెలుసని ఆయన చెప్పారు.