: విజయవాడలో ‘బాహుబలి’ ప్రీమియర్ షోకు సిద్ధమన్న డిస్ట్రిబ్యూటర్లు!


విజయవాడలో ‘బాహుబలి-2’ ప్రీమియర్ షోలకు అనుమతి లభించింది. నగరంలోని కపర్ది, మిరాజ్ థియేటర్లలో ఈ చిత్రం ప్రీమియర్ షోలు వేసేందుకు డిస్ట్రిబ్యూటర్లు సిద్ధమయ్యారు. దీంతో, ఆయా థియేటర్ల వద్ద టిక్కెట్ల కోసం ప్రభాస్ అభిమానులు పడిగాపులు కాస్తున్నారు. అయితే, మల్టీప్లెక్స్ థియేటర్ల వద్ద మాత్రం ఇంకా బుకింగ్ లు ప్రారంభించలేదు.ఈ క్రమంలో ఐనాక్స్ థియేటర్ లోకి అభిమానులు దూసుకువెళ్లడంతో, సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో, ప్రభాస్ అభిమానులకు, సిబ్బందికి మధ్య తోపులాట జరిగింది.

  • Loading...

More Telugu News