: ‘బాహుబలి-2’ని డైనోసార్ తో పోల్చిన రామ్ గోపాల్ వర్మ


‘బాహుబలి’ చిత్రంపైన, ప్రభాస్ ఫ్యాన్స్ పైన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన ట్వీట్ల ద్వారా మరోమారు ఘాటు వ్యాఖ్యలు చేశారు ..‘ఎప్పుడైతే ‘ఏనుగు’ లాంటి భారీ చిత్రం ఒకటి వస్తుందో, ఇతర చిత్రాలను తెరకెక్కించే కుక్కలు మొరుగుతాయి. కానీ, డైనోసార్ వంటి ‘బాహుబలి-2’ వస్తుంటే.. కుక్కలు, పులులు, సింహాలు సైతం దాక్కుంటాయి. ‘బాహుబలి-2’ భీకర గర్జనను వినకుండా తప్పించుకునేందుకు.. హిందీ, తమిళ్, తెలుగు సినీ ఇండస్ట్రీలకు చెందిన ఫిల్మ్ మేకర్స్ తమ చెవుల్లో దూది పెట్టుకున్నారని నేను ఇప్పుడే విన్నాను.

ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషాన్ని చూసి ఇతర హీరోల అభిమానులు తీవ్రంగా అసూయ పడిపోతున్నారనే విషయాన్ని నేను వినలేదన్నది నిజం కాదా?’ అంటూ వర్మ తన వరుస ట్వీట్లలో బాహుబలి 2 చిత్రాన్ని ఆకాశానికి ఎత్తేస్తూ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News