: టర్కీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం... 9000 మంది పోలీసుల తొలగింపు
టర్కీ దేశాధ్యక్షుడు రిసైప్ ఎర్డగోన్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. నిన్న ఆయన ఆదేశాల మేరకు ఆ దేశంలోని దాదాపు 72 ప్రావిన్సుల్లో సుమారు వెయ్యి మందిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ రోజు టర్కీ సర్కారు ఏకంగా 9000 మంది పోలీసులను విధుల నుంచి తొలగించింది. గతేడాది జూన్లో టర్కీలో సైనిక తిరుగుబాటు జరిగిన నేపథ్యంలో 250 మంది మృతి చెందారు. ఇందుకు ముఖ్య కారకుడు వ్యాపార వేత్త గులెన్ అని ఆ దేశ సర్కారు నిర్ధారించి, గులెన్పై చర్యలు తీసుకోవడానికి కూడా సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే గులెన్తో సంబంధాలు ఉన్న వారిపై కఠినంగా వ్యవహరిస్తూ ఇటువంటి చర్యలు తీసుకుంటోంది. కాగా, గులెన్ 2013 నుంచి అమెరికాలో అజ్ఞాతంలో ఉన్నాడు. ఆయనను తమకు అప్పగించాలని టర్కీ ఆ దేశాన్ని కోరుతోంది.