: లక్ష 10 వేల ఇళ్లకు టెండర్లు ఆహ్వానించాం: ఏపీ మంత్రి నారాయణ


గతంలో ఎన్నడూ లేని విధంగా పేదలకు ఇళ్లను నిర్మించి ఇచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారని మంత్రి నారాయణ తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు లక్ష 10 వేల ఇళ్లకు టెండర్లను ఆహ్వానించామని చెప్పారు. ఆధునిక సాంకేతికత, నాణ్యతతో మునుపెన్నడూ లేని విధంగా ఇళ్లను నిర్మిస్తామని తెలిపారు. నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో ఈరోజు మంత్రి అఖిలప్రియతో కలసి అధికారులు, కౌన్సిలర్లతో నారాయణ సమీక్ష నిర్వహించారు. పట్టణంలో ఉన్న 42 మంది కౌన్సిలర్లను సమస్యలు అడిగి తెలుసుకున్నారాయన. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 1వ తేదీన నంద్యాలలో 13 వేల ఇళ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారని చెప్పారు. 

  • Loading...

More Telugu News