: బీసీసీఐపై దావా వేస్తాం: పాక్ క్రికెట్ బోర్డు


అవకాశం వచ్చినప్పుడల్లా బీసీసీఐపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు విమర్శలు గుప్పించడం తెలిసిందే. తాజాగా బీసీసీఐపై దావా వేస్తామని పీసీబీ తెలిపింది. తమతో ద్వైపాక్షిక సిరీస్ లు ఆడకపోవడం వల్ల తమకు భారీగా నష్టం వాటిల్లుతోందని... ఈ నష్టాన్ని పూడ్చుకునేందుకు తాము దావా వేస్తామని పీసీబీ ఛైర్మన్ నజమ్ సేథీ తెలిపారు. దుబాయ్ లో ఐసీసీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ఈ విషయాన్ని బీసీసీఐ ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లామని ట్విట్టర్ ద్వారా ఆయన తెలిపారు.

2014లో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం 2015 నుంచి 2023 వరకు ఇరు దేశాలు 6 ద్వైపాక్షిక సిరీస్ లు ఆడాల్సి ఉందని సేథీ చెప్పారు. అయినా, తమతో సిరీస్ లు ఆడేందుకు బీసీసీఐ ఆసక్తి చూపడం లేదని ఆయన మండిపడ్డారు. బీసీసీఐ వ్యవహారశైలితో తాము దాదాపు రూ. 1200 కోట్లు నష్టపోయామని తెలిపారు. కాగా, ప్రస్తుతం ఐసీసీ ఛైర్మన్ శశాంక్ మనోహర్ బీసీసీకి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే దూకుడు పెంచేందుకు పాక్ క్రికెట్ బోర్డు ప్రయత్నిస్తోంది. 

  • Loading...

More Telugu News