: వరుసగా నాలుగు నెలల పాటు విశ్వనాథ్ గారి సినిమాలు చూశాను: అల్లు అర్జున్


వరుసగా ఓ నాలుగు నెలల పాటు ప్రముఖ దర్శకుడు విశ్వనాథ్ గారి సినిమాలు చూశానని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చెప్పాడు. ఓ న్యూస్ ఛానెల్ తో మాట్లాడుతూ, ఎప్పుడో చిన్నప్పుడు విశ్వనాథ్ గారి సినిమాలు చూశానని, అయితే, ఆ సినిమాల డెప్తు గురించి తెలుసుకునేంత అనుభవం తనకు లేదని చెప్పాడు. ఆయన దర్శకత్వంలో అద్భుతంగా తెరకెక్కిన శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం, సిరివెన్నెల, స్వర్ణ కమలం, స్వయంకృషి .. ఇలా ఇరవై సినిమాలను వరుసగా నాలుగు నెలల్లో చూశానని చెప్పాడు.

‘నాకు పర్సనల్ గా విశ్వనాథ్ గారితో కనెక్షన్ ఏంటంటే.. శంకరాభరణం సినిమాలో మా తాత గారు అల్లు రామలింగయ్య పాత్ర .. ఆయన కెరీర్ లో ఓ మైల్ స్టోన్ విశ్వనాథ్ గారు ఇచ్చిందే...’ అని బన్నీ చెప్పుకొచ్చాడు. కాగా, భారతీయ చలన చిత్ర రంగంలో ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికైన కళాతపస్వి కె.విశ్వనాథ్ ను అల్లు అర్జున్ నిన్న కలిసి అభినందనలు తెలిపాడు.

  • Loading...

More Telugu News