: ధోనీని మరోసారి చిన్నచూపు చూసిన దాదా!


భారతీయ క్రికెట్ దిగ్గజం సౌరవ్ గంగూలీ మరోసారి టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీని చిన్న చూపు చూశాడు. తన డ్రీమ్ ఐపీఎల్ టీమ్ లో ధోనీకి దాదా స్థానం కల్పించలేదు. ధోనీ స్థానంలో వికెట్ కీపర్ గా ఢిల్లీ డేర్ డెవిల్స్ ఆటగాడు రిషబ్ పంత్ కు బాధ్యతలను అప్పగించాడు. కొన్ని రోజుల క్రితం గంగూలీ మాట్లాడుతూ టీ20లకు ధోనీ పనికిరాడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి గంగూలీపై కొందరు విమర్శలు చేసినా ఆయన పట్టించుకోలేదు. ఇప్పుడు తన డ్రీమ్ టీమ్ లో కూడా ధోనీని పక్కన పెట్టేశాడు. ఎంతో ఆలోచన, కొన్ని కష్టతరమైన నిర్ణయాల తర్వాత ఈ డ్రీమ్ టీమ్ ను రూపొందించానని గంగూలీ తెలిపాడు.

గంగూలీ ఐపీఎల్ డ్రీమ్ టీమ్ ఇదే...

విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్, స్టీవెన్ స్మిత్, ఏబీ డివిలియర్స్, నితీష్  రాణా, మనీష్ పాండే, రిషభ్‌ పంత్, సునీల్ నరైన్, అమిత్ మిశ్రా, భువనేశ్వర్ కుమార్, క్రిస్ మోరిస్. 

  • Loading...

More Telugu News