: దినకరన్ ను అరెస్టు చేశారు.. మరి చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేయరు?: బొత్స సత్యనారాయణ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. ఈ రోజు ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ... ఈసీకి లంచం ఇవ్వబోయాడని తమిళనాడు నేత దినకరన్‌ను అరెస్ట్ చేశారని, మరి ఓటుకు కోట్లు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఎందుకు అరెస్ట్ చేయలేదని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వం దోపిడీలకు పాల్పడుతోందని ఆయన ఆరోపణలు చేశారు.
భావనపాడు పోర్టుకు గ్లోబల్ టెండర్లు ఎందుకు పిలవలేదని ఆయన అడిగారు. పోర్టు ఆదాయంలో 2.3 శాతం వాటాను ఏపీ సర్కారుకి ఇవ్వడానికి జరిగిన ఒప్పందాల వెనక ఏమి జరిగిందని ఆయన ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు పనుల్లో ఏపీ సర్కారు తమకు ఇష్టం వచ్చిన వారికి కాంట్రాక్టులు ఇచ్చి దోచుకున్నట్లుగానే భావనపాడులో కూడా మరో దోపిడికి సిద్ధమయిందని ఆయన ఆరోపించారు.