: ‘కేసీఆర్’ అనగానే 'జిందాబాద్' అంటూ నినాదాలు చేసిన ‘కాంగ్రెస్’ మహిళా నేతలు


ప్రసూతి ఆస్పత్రులలో స‌రైన వైద్యం అంద‌క‌ బాలింతలు మృతి చెందుతున్న నేప‌థ్యంలో ఈ అంశంపై తెలంగాణ మహిళా కాంగ్రెస్ నేత‌లు ఈ రోజు ఆందోళ‌న నిర్వ‌హించారు. అయితే, ఈ ఘ‌ట‌న‌ల‌పై హైద‌రాబాద్‌లో హెచ్ఆర్సీకి పిర్యాదు ఇచ్చేందుకు వారంతా వెళుతోన్న స‌మ‌యంలో ఆ ర్యాలీలో 'కేసీఆర్ జిందాబాద్' అనే నినాదం విన‌ప‌డడం విశేషం.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మాజీ మంత్రులు డీకే అరుణ, సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి కూడా పాల్గొన్నారు. టీఆర్ఎస్ స‌ర్కారు తీరుకి వ్య‌తిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకు వెళుతోన్న స‌మ‌యంలో ఓ కాంగ్రెస్ నేత ‘కేసీఆర్’ అని అనగానే, అక్కడ ఉన్నవారు 'జిందాబాద్' అనేయ‌డంతో కాంగ్రెస్ నేతలు కంగుతిన్నారు. 

  • Loading...

More Telugu News