: రాజ‌మౌళి త‌ర్వాత ‘బాహుబ‌లి’ క్రెడిట్ అంతా ఆమెకే: రాజ‌మౌళి త‌న‌యుడు కార్తీకేయ


బాహుబలి పార్ట్ 1, 2 సినిమాల క్రెడిట్ అంతా రాజమౌళిదేనని, అసలైన బాహుబలి ఆయనేనని దర్శకధీరుడి అభిమానులు చెప్పుకుంటారు. అయితే, బాహుబలి సినిమాను తెరకెక్కించడంలో రాజమౌళి తర్వాత ఆ క్రెడిట్ అంతా తన పిన్ని వల్లి (కీరవాణి భార్య)కే చెందుతుంద‌ని రాజ‌మౌళి త‌న‌యుడు కార్తీకేయ అన్నాడు. ఈ రోజు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... ఈ ప్రాజెక్ట్ కోసం ఆమె బాగా శ్ర‌మించార‌ని అన్నాడు. తాను రాజ‌మౌళిని బాబా అని పిలుస్తాన‌ని కార్తీకేయ చెప్పాడు. బాహుబ‌లి సినిమాకు ప‌నిచేయ‌డం ద్వారా తాను ఎన్నో విష‌యాలు నేర్చుకున్నాన‌ని అన్నాడు. ఎవ‌ర‌యినా త‌న‌ను తిడితే రూంలోకి వెళ్లి త‌లుపుపెట్టుకొని బాగా నిద్ర‌పోతాన‌ని చెప్పాడు. త‌న గురించి ఎక్కువ సీక్రెట్స్ త‌న త‌ల్లికి మాత్ర‌మే తెలుస‌ని చెప్పాడు.

  • Loading...

More Telugu News