: ‘బాహుబలి 2’ కీల‌క‌ ఇంటర్వెల్ సీన్ లీక్ పై జోక్ అదుర్స్‌!


భారీ బ‌డ్జెట్‌తో ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన బాహుబ‌లి-2 సినిమాకు చెందిన ప‌లు సీన్లు ఇప్ప‌టికే లీకైపోయి ఆన్‌లైన్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయ‌ని ఎన్నో వార్త‌లు గుప్పుమంటున్న విష‌యం తెలిసిందే. అదే విధంగా బాహుబ‌లి జోకులు కూడా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. వీటిలో బాహుబలి ఇంటర్వెల్ సీన్ అంటూ సర్క్యూలేట్ అవుతున్న ఓ వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో విప‌రీతంగా ఆస‌క్తి రేపుతోంది. ఈ వీడియోను చూసి కొన్ని క్ష‌ణాల పాటు నిజంగానే బాహుబ‌లి ఇంట‌ర్వెల్ సీన్ లీకై పోయింద‌ని భావిస్తోన్న నెటిజ‌న్లు ఆ త‌రువాత అస‌లు నిజాన్ని తెలుసుకొని విర‌గ‌బ‌డి న‌వ్వుతున్నారు.
 
ఈ వీడియోలో శివగామి గెటప్ లో రమ్యకృష్ణ ముందుగా క‌నబ‌డుతోంది. దీంతో బాహుబ‌లి-2 కి సంబంధించిన వీడియోనే అనుకొని నెటిజ‌న్లు కొన్ని క్ష‌ణాలు భ్ర‌మ‌ప‌డిపోయి తీవ్ర ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. అనంత‌రం ఈ వీడియో ఏడాది క్రితం టీవీలలో వచ్చిన ఓ యాడ్‌కు సంబంధించిందని అర్థ‌మైపోయి విర‌గ‌బ‌డి నవ్వుకుంటున్నారు. బాహుబ‌లి క్రేజుని క్యాష్ చేసుకునేందుకు ఈ పాత వీడియోనే బాహుబలి 2 ఇంటర్వెల్‌ సీన్ లీక్ అంటూ పోస్టు చేశార‌ని స‌మాచారం. ఈ వీడియోను మీరూ చూడండి...


  • Loading...

More Telugu News