: నాకు అరేంజ్డ్ మేరేజ్ ఇష్టం: చిరంజీవితో సీక్రెట్ విప్పిన యాంకర్ ప్రదీప్


తెలుగు బుల్లితెర మేల్ యాంకర్లలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్ ప్రదీప్...తెలుగు బుల్లి తెరపై స్టార్ యాంకర్ గా ఉన్న ప్రదీప్...మెగాస్టార్ చిరంజీవి నిర్వహిస్తున్న మీలో ఎవరు కోటీశ్వరుడు షోకు వెళ్లాడు. మరో యాంకర్ రష్మీతో కలిసి ఈ షోలో పాల్గొన్న ప్రదీప్... చిన్నప్పుడు పెళ్లికార్డుల్లో పెళ్లి కొడుకు పేరు ముందు చిరంజీవి అని వేసేవారని, పెళ్లి కార్డులో అది చూసి, ఈ పెళ్లి చిరంజీవి బంధువులదని, ఆ పెళ్లికి వెళ్తే చిరంజీవిని చూడొచ్చని ఆశపడేవాడినని తెలిపాడు. బాగా తయారై పెళ్లిళ్లకు వెళ్లేవాడినని, అక్కడి చిన్న పిల్లలతో బాగా ఆడుకుని అలసిపోయి నిద్రపోయేవాడినని, 'పోన్లే ఇంకో పెళ్లిలో చిరంజీవిని చూడొచ్చని' తనకు తాను సర్ది చెప్పుకునేవాడినని బాల్యాన్ని గుర్తు చేసుకున్నాడు.

దీంతో చిరంజీవి 'అయితే ఓపని చెయ్యిండి...మీరే పెళ్లి కార్డులో మీ పేరు ముందు చిరంజీవి అని అచ్చేయించుకోండి...తప్పకుండా వస్తాను' అన్నారు. దీంతో మళ్లీ ఆయనే కలుగ జేసుకుని...'పెళ్లికి వస్తానని నేను మాటిచ్చేశాను సరే...ఇంతకీ నీకు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా?' అని అడిగారు. దీంతో రష్మీ కలుగ జేసుకుని, 'సరైన పాయింట్ పట్టుకున్నారు సర్...అలా అడగండి' అని ఆటపట్టించింది. దీంతో ప్రదీప్ సమాధానం చెబుతూ, తనకు అరేంజ్డ్ మేరేజ్ అంటే ఇష్టం అని చెప్పాడు. ఇంట్లో వాళ్లు సంబంధాలు చూస్తున్నారని వెల్లడించాడు. వాళ్లెవరిని ఎంపిక చేస్తే వారినే చేసుకుంటానన్నాడు. అయితే తనకు కొన్ని లక్ష్యాలున్నాయని, వాటిని నెరవేర్చుకున్న తరువాత పెళ్లి పీటలు ఎక్కుదామని ఆగానని చెప్పాడు. అయితే 'నా పెళ్లికి మీరు వస్తానన్నారు కాబట్టి...కొంచెం వేగంగా వెతకండ'ని చెబుతానని ప్రదీప్ తెలిపాడు. 

  • Loading...

More Telugu News