: దినకరన్‌ను చెన్నైకి తరలించిన ఢిల్లీ పోలీసులు


ఏఐఏడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్ ను ఢిల్లీ నుంచి చెన్నైకి తరలించారు. ఎన్నికల సంఘానికి లంచాన్ని ఇవ్వజూపిన కేసులో దినకరన్ ను ఢిల్లీ క్రైంబ్రాంచ్ పోలీసులు సోమవారం నాడు అరెస్ట్ చేశారు. అనంతరం విచారణ కోసం ఆయనను ఐదురోజుల పాటు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తదుపరి విచారణ కోసం అతడిని ఢిల్లీ నుంచి చెన్నైకి తరలించారు. మరోవైపు, చెన్నైలోని దినకరన్ ఇంట్లో సోదాలు నిర్వహించేందుకు కూడా కోర్టు నుంచి ఢిల్లీ పోలీసులు అనుమతి తీసుకున్నారు. దినకరన్ తో పాటు సహ నిందితుడు మల్లికార్జున, మధ్యవర్తి సుఖేష్ పై కూడా దర్యాప్తు జరపనున్నారు. 

  • Loading...

More Telugu News