: శ్రీనగర్ లో మహిళా వేర్పాటువాద నేత ఆసియా అంద్రాబీ అరెస్ట్


వేర్పాటు వాద నేత, హురియత్ కాన్ఫరెన్స్ సభ్యురాలు, దుఖ్ త్రాన్ ఏ మిల్లత్ చీఫ్ ఆసియా అంద్రాబీని గురువారం నాడు శ్రీనగర్ లో అరెస్ట్ చేశారు. జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నేరంపై ఆమెను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసు వర్గాలు ధ్రువీకరించాయి. కాశ్మీర్ లోయలో ప్రజలపై ఆంక్షలను విధిస్తూ, వాటిని బలవంతంగా అమలు చేస్తున్న దుఖ్ త్రాన్ ఏ మిల్లత్ పై చాలా కాలంగా ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలుమార్లు వ్యాఖ్యానించినట్టు కేసులు నమోదయ్యాయి.

ఇటీవలి కాలంలో భద్రతా దళాలు అరెస్ట్ చేసిన మిలిటెంట్లను విచారించగా, అంద్రాబీ ప్రసంగాలతో ప్రేరేపితమై, తాము ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు వారు వెల్లడించిన నేపథ్యంలోనే అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. హిజ్బుల్ ముజాహిద్దీన్ నేత, ప్రస్తుతం జైల్లో ఉన్న ఆషిక్ హుస్సేన్ ఫక్తూను వివాహం చేసుకున్న ఆమె ప్రసంగాల వీడియోలను వాస్తవాధీన రేఖకు ఆవల పాక్ నిర్వహించే ఉగ్ర క్యాంపుల్లో తరచూ ప్రదర్శిస్తుంటారనడానికి సాక్ష్యాలు ఉన్నాయని పోలీసు వర్గాలు వెల్లడించాయి.

  • Loading...

More Telugu News