: రాహుల్ గాంధీకి అన్నీ వివరించా: ఖుష్బూ
తమిళనాడులోకి దొడ్డి దారిన ప్రవేశించేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని ప్రముఖ సినీ నటి, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఖుష్బూ ఆరోపించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్నాడీఎంకే, బీజేపీలు కూటమిగా ఏర్పడినా ఆశ్చర్యం లేదని అన్నారు. తమ రాజకీయ భవిష్యత్తును కాపాడుకునేందుకు బీజేపీతో అన్నాడీఎంకే నేతలు చేతులు కలుపుతారని చెప్పారు. తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించేందుకు కూడా బీజేపీ పథకం రూపొందిస్తోందని చెప్పారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను తమ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి వివరించానని తెలిపారు.