: బట్టలు కూడా లాగేస్తున్నారంటూ... 'బాహుబలి'పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన యాంకర్ రవి!


'బాహుబలి: ది కన్ క్లూజన్' విషయంలో మల్టీ ప్లెక్సుల ఆగడాలపై టీవీ యాంకర్ రవి చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. "ఆలోచించకుండా... ఎంత అడిగితే అంత ఇస్తున్నాము!! ఐ ఫీల్ దే ఆర్ లూటింగ్ అజ్ ఫ్రెండ్స్... బ్రెడ్ ముక్క, కొంచెం చీజ్, రెండు టొమాటో మరియు కీర ముక్కల శాండ్‌విజ్ 70 రూపాయలు. పాప్‌కార్న్ 3 వందల నుంచి 350 రూపాయలంట.. వాటర్ బాటిల్ 40 రూపాయలు. మల్టీ‌ప్లెక్స్‌ లలో ఫుడ్‌ కాస్ట్ పరిస్థితి ఇది... వాలెట్ నుంచి డబ్బులు తీసుకోవడం వ్యాపారం... బట్టలు కూడా లాగేసుకోవడం దారుణం!! డూ యూ ఎగ్రీ?" అని ప్రశ్నించాడు. వినియోగదారుడిని అందిన కాడికి దోచుకుంటున్నారని ఆరోపిస్తూ, రవి చేసిన పోస్టుపై నెటిజన్లు పాజిటివ్ గా స్పందిస్తూ, మద్దతు పలుకుతున్నారు.

  • Loading...

More Telugu News