: ఆంధ్రాలోని విచ్చలవిడితనాన్ని తెలంగాణపై రుద్దుతున్నారు: 'బాహుబలి' షోలపై మంత్రి తలసాని
ఆంధ్రప్రదేశ్ లో సినిమాల ప్రదర్శనకు విచ్చలవిడిగా అనుమతులిచ్చారని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రాలో ఏం జరిగినా టీవీ ఛానెళ్లు తెలంగాణలో జరిగినట్టు చూపెడుతుంటాయని అన్నారు. అలాగే ఇప్పుడు తెలంగాణలో విచ్చలవిడిగా సినిమాషోల ప్రదర్శనకు అనుమతిచ్చామని, టికెట్ ధరలు పెంచుకోవచ్చని ప్రసారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు.
ఏపీలో జరిగే వాటికి తెలంగాణలో జరుగుతున్నట్టు చూపించడం సరికాదని ఆయన మండిపడ్డారు. తెలంగాణలో అదనపు షోలకు అనుమతుల్లేవని తెలిపారు. అలాగే టికెట్ ధరలు పెంచినా తీవ్ర చర్యలుంటాయని ఆయన స్పష్టం చేశారు. బెనిఫిట్ షోలకు కూడా అనుమతులు లేవని ఆయన స్పష్టం చేశారు. ఏపీలో చేస్తున్నవన్నీ తెలంగాణలో జరుగుతున్నాయని ఆరోపించడం మంచిది కాదని ఆయన తెలిపారు.