: మా ఫ్యామిలీలోకి అందమైన ఆడ గుర్రపు పిల్ల వచ్చింది.. ఉపాసన ట్వీట్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఓ అందమైన ఆడ గుర్రపు పిల్ల తమ కుటుంబంలో చేరిందని, అది పుట్టిన మూడు గంటలకు ఈ ఫొటో తీశామంటూ ఆ ఫొటోను పోస్ట్ చేశారు. ఆ ఫొటోలో చిన్నారి గుర్రపు పిల్లను పలకరిస్తూ రామ్ చరణ్ ఉన్నాడు. కాగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో రామ్ చరణ్ నటిస్తున్నాడు. ఈ చిత్రం తొలి షెడ్యూల్ పూర్తయింది.