: టీటీవీ దిన‌క‌ర‌న్‌కు 5 రోజుల పోలీసు క‌స్ట‌డీ విధించిన కోర్టు


త‌మిళ‌నాడులోని అధికార అన్నాడీఎంకే శశికళ వ‌ర్గానికి రెండాకుల గుర్తు కేటాయించాల‌ని కోరుతూ ఎన్నిక‌ల అధికారికి లంచం ఇవ్వ‌బోయాడ‌ని ఆరోప‌ణ‌లు ఎదుర్కుంటున్న శ‌శిక‌ళ మేన‌ల్లుడు టీటీవీ దిన‌క‌ర‌న్‌ను నాలుగురోజులు విచారించిన ఢిల్లీ పోలీసులు నిన్న రాత్రి అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. ఆయ‌న‌ను ఈ రోజు న్యాయస్థానంలో హాజ‌రుప‌ర్చ‌గా కోర్టు 5 రోజుల పోలీసు క‌స్ట‌డీ విధించింది. ఈ కేసులో పోలీసులు ఆయ‌న‌ను మ‌రిన్ని అంశాల‌పై ప్ర‌శ్నించ‌నున్నారు. ఆర్కేనగర్ ఉప ఎన్నికల నేపథ్యంలో దినకరన్ ఈ ఆరోపణలు ఎదుర్కున్నారు.   

  • Loading...

More Telugu News