: నా గత జన్మకు సంబంధించిన ఒక ఫొటో ఇది: రామ్ గోపాల్ వర్మ
సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసే సినిమాలకే కాదు చేసే ట్వీట్లకు కూడా తనదైన ముద్ర ఉంటుంది. అదీ ఇదీ ... వారు వీరూ అన్న తేడా లేకుండా... పలు అంశాలపై వర్మ లెక్కలేనన్ని ట్వీట్లు చేశారు. అదే వర్మ, తన చిన్నారి కూతురితో గతంలో దిగిన ఓ ఫొటోను పోస్ట్ చేశారు. ‘నా పూర్వ జన్మకు సంబంధించిన ఒక చిత్రం. రాక్షసుడిగా మారకముందు, నా మానవత్వం ఇంకా బతికున్న మంచి రోజుల్లో నా కూతురితో దిగిన ఫొటో ఇది’ అని వర్మ తన పోస్ట్ లో పేర్కొన్నారు.