: భల్లాలదేవను చంపబోయి కట్టప్ప బాహుబలిని చంపేశాడు!: ప్రభాస్ చమత్కారం


బాహుబలి-2 సినిమా మ‌రో రెండు రోజ‌ల్లో విడుద‌ల కానున్న విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా మ‌రో రెండు రోజుల్లో బాహుబ‌లిని క‌ట్ట‌ప్ప ఎందుకు చంపాడో తెలిసిపోతుంద‌ని, అభిమానులు సంబ‌ర‌ప‌డిపోతున్నారు. టికెట్ల కోసం బారులు తీరి ఎగ‌బ‌డుతున్నారు. ఓ అద్భుత ర‌హ‌స్యంలా బాహుబ‌లిని క‌ట్ట‌ప్ప ఎందుకు చంపాడన్న విష‌యాన్ని కొద్దిగా కూడా బ‌య‌ట‌కు రానివ్వ‌కుండా ఈ సినిమా టీమ్ అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంది. అందుకు సంబంధించిన చిన్న క్లూ కూడా ఇవ్వ‌డం లేదు. అయితే, బాహుబ‌లి ప్రచారంలో భాగంగా రానాతో క‌లిసి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప్ర‌భాస్‌కి ఎప్పుడూ ఎదుర‌య్యే ప్ర‌శ్నే ఎదురైంది.
 
బాహుబ‌లిని క‌ట్ట‌ప్ప ఎందుకు చంపాడ‌ని ప్రభాస్ ను అడ‌గ‌గా ఆయన అందుకు ఓ స‌మాధానం ఇచ్చాడు. క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని కావాల‌ని చంప‌లేద‌ని, చిన్న క‌న్ఫ్యూజ‌న్‌లో బాహుబ‌లిని వెన‌కనుంచి చూసి భ‌ల్లాలదేవుడు అనుకుని చంపేశాడ‌ని ప్రభాస్ చమత్కరించాడు. తర్వాత ఇది సరదా కోసం అన్నానని, అసలు విషయాన్ని వెండితెరపై చూడాలని చెప్పాడు. ఇక ఇటీవ‌లే రానాకు ఇటువంటి ప్ర‌శ్నే ఎదురుకాగా, త‌న‌కు ఆ విష‌యం తెలియ‌ద‌ని ఆ సీన్ చీక‌ట్లో ఉంద‌ని, త‌న‌కు స‌రిగా క‌నిపించ‌లేద‌ని స‌మాధానం ఇచ్చిన విష‌యం తెలిసిందే. అయితే, బాహుబ‌లి క‌ట్ట‌ప్ప‌ను ఎందుకు చంపాడో తెలుసుకోవాలంటే మ‌రో రెండు రోజులు వేచిచూడాల్సిందే. అప్ప‌టివ‌ర‌కు ఇలా ఆ స్టార్లు చెబుతున్న ఇలాంటి స‌ర‌దా క‌బుర్ల‌తో సంతోష‌ప‌డుతున్నారు ఫ్యాన్స్‌.

  • Loading...

More Telugu News