: ఈ విషయాన్ని పొరపాటున చెప్పేశా: సెరెనా విలియమ్స్


టెన్నిస్ మహారాణి, నల్లుకలువ సెరీనా విలియమ్స్ గర్భవతి అనే సంగతి తెలిసిందే. తాను 20 వారాల గర్భవతినంటూ స్నాప్ చాట్ ద్వారా సెరెనా ఇటీవలే వెల్లడించింది. అయితే తాను గర్భవతి అనే విషయాన్ని పొరపాటున చెప్పేశానని ఆమె తెలిపింది. తానెప్పుడూ తన వ్యక్తిగత విషయాలు బయటకు తెలియకుండా జాగ్రత్త పడుతుంటానని... అయితే ఈసారి మాత్రం పొరపాటు జరిగిపోయిందని చెప్పింది.

ఆస్ట్రేలియా ఓపెన్ ఆడేటప్పుడు తాను గర్భవతిననే విషయం గురించి ఆలోచించలేదని... టోర్నమెంట్ గెలవాలన్న ఆలోచన మాత్రమే ఉందని సెరీనా తెలిపింది. ఆడిన ప్రతిసారీ గెలవాలని తాను కోరుకుంటానని... తాను ఓడిపోతేనే అది బ్రేకింగ్ న్యూస్ అవుతుందని చెప్పింది. అమ్మ కావడం జీవితంలో ఒక భాగమని... తనకు బిడ్డ పుట్టిన తర్వాత కూడా టెన్నిస్ ఆడతానని... తన బిడ్డ స్టాండ్ లో నిలబడి చప్పట్లు కొడుతూ తన ఆటను చూడాలని చెప్పుకొచ్చింది.

  • Loading...

More Telugu News