: ప్రభాస్ కొత్త సినిమా టీజర్ లీకైపోయిందా?


బాహుబలి సినిమా త‌రువాత యంగ్ రెబ‌ల్ స్టార్‌ ప్ర‌భాస్ న‌టిస్తోన్న సినిమాపై భారీగానే అంచ‌నాలు ఉంటాయి. అయితే, ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న కొత్త చిత్రం సాహో టీజ‌ర్ లీకైపోయింద‌ట‌. అందులో ప్ర‌భాస్‌ కొత్త లుక్‌తో క‌నిపిస్తున్నాడంటూ అభిమానుల్లో చ‌ర్చ మొద‌లైంది. ప్ర‌భాస్, సుజిత్‌ల కాంబినేషన్‌లో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. సాహో టీజర్‌ను 'బాహుబలి 2' విడుదల రోజు రిలీజ్ చేయనుండ‌గా, అంతకు ముందుగానే ఆ టీజర్ లీకైపోయిన‌ట్లు స‌మాచారం. అందులో ముఖమంతా రక్తం మరకలతో ప్రభాస్ క‌ని‌పిస్తుండ‌డంతో ప్ర‌భాస్ అభిమానులు ఆ టీజ‌ర్ ఆధారంగా సినిమా సీన్ గురించి చ‌ర్చించుకుంటున్నారు.

  • Loading...

More Telugu News