: డిల్లీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి అజయ్ మాకెన్ రాజీనామా


ఢిల్లీ మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాభవానికి నైతిక బాధ్యత వహిస్తూ, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ మాకెన్ రాజీనామా చేశారు. ఈ ఓటమికి తానే బాధ్యత తీసుకుంటున్నానని, వచ్చే ఏడాది పాటు తాను ఎటువంటి పదవులనూ స్వీకరించబోనని కూడా ఆయన తెలిపారు. ఓ కార్యకర్తగా ఉంటానని, ఈ ఎన్నికల్లో తాము మరింత మెరుగైన ఫలితాలను ఊహించామని, అయితే, గతంలో కన్నా పుంజుకున్నామని ఆయన అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ వ్యక్తం చేసినట్టుగానే ఈవీఎంల పనితీరుపై తమకూ కొన్ని అనుమానాలున్నాయని తెలిపారు. కాగా, ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి, వరుసగా మూడో సారి అధికారాన్ని దక్కించుకునేందుకు సిద్ధంగా వున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News