: అత్యాచారం చేస్తాడేమోనని రాత్రంతా బాత్రూంలో గడిపిన బాలిక!
అత్యాచారయత్నం చేసిన యువకుడి బారినుంచి తప్పించుకుని రాత్రంతా బాత్రూంలో బిక్కుబిక్కుమంటూ యువతి గడిపిన ఘటన హైదరాబాదులోని యూసుఫ్ గుడా ఎల్ఎన్ నగర్ లో చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళ్తే...హైదరాబాదులోని ఒక టీవీ ఛానల్ లో పని చేసే రత్న కుమార్ (30) అనే యువకుడు యూసుఫ్ గూడలోని ఎల్ఎన్ నగర్ లో అద్దెకు నివాసం ఉంటున్నాడు. తమ పక్కింట్లో ఉండేవారు వారి కుమార్తె (18)ను ఒక్కదానిని ఇంట్లో ఉంచి ఊరు వెళ్లారు.
దీనిని గమనించిన రత్న కుమార్ అర్ధ రాత్రి సమయంలో వారి ఇంట్లో చొరబడ్డాడు. ఆమెపై అత్యాచారయత్నం చేశాడు. అతని నుంచి తప్పించుకున్న యువతి ఇంట్లోని బాత్రూమ్ లో దూరి లోపల గడియ పెట్టుకుంది. గది తలుపు తెరిచే ప్రయత్నం చేస్తే...అరుస్తానని బెదిరించింది. దీంతో అతను వెనుదిరిగాడు. అయినప్పటికీ రాత్రంతా అందులోనే గడిపింది. అనంతరం బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.