: టెన్సిస్ మాజీ రారాణి షరపోవా పునఃరంగప్రవేశం


టెన్నిస్ లో అందగత్తెల్లో ఒకరిగా కీర్తిగడించిన రష్యా టెన్నిస్ స్టార్ మారియా షరపోవా పునఃప్రవేశానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. నిషేధిత ఉత్ప్రేరకం మొల్డొనియం తీసుకున్నందుకు  గాను ఆమె ఏడాదిన్నర నిషేధాన్ని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. నేటితో ఆ ఏడాదిన్నర నిషేధం పూర్తి కానుంది. దీంతో నేడు ఫ్రెంచ్ ఓపెన్ కు సన్నాహకంగా జరిగే స్టట్ గార్ట్ టోర్నీలో ఆమె వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఆడనుంది. ఇటలీ క్రీడాకారిణి రాబర్టా విన్సితో షరపోవా పునరాగమనం తరువాత తొలి మ్యాచ్ ఆడనుంది. వైల్డ్ కార్డ్ ద్వారా షరపోవాకు అవకాశం ఇవ్వడంపై విమర్శలు మొదలయ్యాయి. నిషేధం ముగియగానే ఆమెకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వాల్సిన అవసరం ఏంటంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. 

  • Loading...

More Telugu News