: 57 కోట్ల రూపాయలతో తిరుపతిలో నిర్మిస్తున్న హోటల్ పై ఐటీ దాడులు... సుదీర్ఘ తనిఖీలు
తిరుపతిలోని తనపల్లి క్రాస్ రోడ్ వద్ద సుమారు 57 కోట్ల రూపాయల వ్యయంతో భారీ ఎత్తున నిర్మాణం జరుగుతున్న బ్లిస్ హోటల్ పై ఆదాయపు పన్ను శాఖాధికారులు దాడులు నిర్వహించారు. ఆ హోటల్ లెక్కలు తప్పుల తడకలుగా ఉన్నాయని ఐటీ అధికారులు చెబుతున్నారు. గత 15 గంటలుగా ఈ హోటల్ లో 20 మంది అధికారులతో తనిఖీలు నిర్వహిస్తున్నట్టు ఐటీ అధికారులు చెప్పారు. ఈ నేపథ్యంలో హోటల్ నిర్మాణానికి సంబంధించిన పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.