: చెప్పిన పని చేసిన ఉద్యోగులకు వరంగల్ కలెక్టర్ బంపర్ ఆఫర్... బాహుబలి-2 ఫ్రీ టికెట్స్!


వరంగల్ జిల్లా ప్రభుత్వ అధికారులకు కలెక్టర్ ఆమ్రపాలి బంపర్ ఆఫర్ ఇచ్చారు. వరంగల్ పట్టణ సుందరీకరణ పనుల్లో పాలుపంచుకుని యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలన్న కలెక్టర్ ఆదేశాల ప్రకారం...గత పదిహేను రోజులుగా వరంగల్‌ నగర సుందరీకరణ పనుల్లో తలమునకలై ఉన్న అధికారులందర్నీ ఆనందంలో ముంచెత్తే వార్తను ఆమె వినిపించారు.

బాహుబలి-2 సినిమాను వారందరికీ ఉచితంగా చూపించనున్నారు. వారు చేసిన శ్రమకు వెలకట్టలేని కలెక్టర్ వారందర్లో మరింత ఉత్సాహం కలిగించేలా...వరంగల్‌ పట్టణంలోని ఒక ధియేటర్ లో 350 టికెట్లు బుక్ చేసినట్టు తెలుస్తోంది. ఒక షో మొత్తంలో 500 టికెట్లు కావాలని చెప్పిన ఆమె, నగర సుందరీకరణ పనుల్లో తలమునకలై ఉన్న 200 మంది అధికారులు, ఉద్యోగులు, 100 మంది కళాకారులకు ఈ సినిమా చూపించనున్నారు. ఏసియన్ మాల్ లో ఈ నెల 28న బాహుబలి-2 సినిమా చూసి కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసుకోనున్నారు. కలెక్టర్ నిబద్ధత, ఉద్యోగులపై చూపిన అభిమానంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. 

  • Loading...

More Telugu News