: ‘డిజిటల్ ఇండియా’కు సారథ్యం వహించమని ప్రధాని నన్ను కోరారు: సీఎం చంద్రబాబు
‘డిజిటల్ ఇండియా’కు సారథ్యం వహించమని ప్రధాని నరేంద్రమోదీ తనను కోరినట్లు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు. వెలగపూడిలో హెచ్ ఓడీలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, నీతి ఆయోగ్ సమావేశంలో ‘న్యూ ఇండియా’ కార్యక్రమాన్ని ప్రకటించారని, సన్ రైజ్ ఏపీ, స్వర్ణాంధ్రప్రదేశ్ కార్యక్రమాలను ఇందులో భాగంగా చేస్తున్నామని చెప్పారు. పశు సంవర్థక శాఖ ద్వారా ఆశించిన వృద్ధి సాధించే అవకాశం ఉందని, ఉద్యావన శాఖలో ఆశించిన మేరకు లక్ష్యాలు సాధించలేకపోతున్నట్లు చంద్రబాబు అన్నారు.