: కొనసాగుతున్న అత్యధిక ఉష్ణోగ్రతలు... కడపలో అత్యధికంగా 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత
ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రతకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉష్ణగాలులతో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సూర్యుడి ప్రతాపానికి మధ్యాహ్న వేళల్లో ప్రజలు బయటకు రావడానికే జంకుతున్నారు. ఈ రోజు కడపలో అత్యధికంగా 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు...
తిరుపతి, కర్నూలు- 44 డిగ్రీలు
గన్నవరం, రాజమహేంద్రవరం- 43 డిగ్రీలు
నంద్యాల- 42.8
నరసరావు పేట- 42.3
మార్కాపురం, ఓర్వకల్లులో- 42 డిగ్రీలు
అమరావతి 41.6
అన్నవరం- 41.3
నందిగామ, శ్రీకాకుళం- 41 డిగ్రీలు
గుంటూరు -40.7 డిగ్రీలు
విజయవాడ -40.6 డిగ్రీలు
గుంతకల్లు -40.4 డిగ్రీలు
ఒంగోలు -40 డిగ్రీలు
కాకినాడ -38.5 డిగ్రీలు
ఏలూరు- 38.3 డిగ్రీలు
తణుకు, భీమవరం- 38 డిగ్రీలు