: సన్నీ లియోన్ ఫేవరెట్ క్రికెటర్ ఎవరో తెలుసా?
బాలీవుడ్ శృంగార నటి సన్నీ లియోన్ కు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఆమె ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా ఆమె అభిమానించేవారు కూడా ఉంటారు. ఓ అభిమాని ఆమెను మీరు అభిమానించే క్రికెట్ టీమ్ ఏది? మీ అభిమాన క్రికెటర్ ఎవరు? అని ప్రశ్నించాడు. దీనికి సమాధానమిచ్చిన సన్నీ... తాను అభిమానించే క్రికెట్ టీమ్ ఇండియానే అని చెప్పింది. ఇండియాకు అద్భుత విజయాలను అందించిన ధోనీ తన అభిమాన క్రికెటర్ అని తెలిపింది.