: మరో దుందుడుకు చర్య.. భారీ ఫైరింగ్ డ్రిల్ జరిపిన ఉత్తరకొరియా
ఉత్తర కొరియా సైన్యం ఏర్పడి 85 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆ దేశం ఈ రోజు భారీ ప్రదర్శనతో తమ ఆయుధ సంపత్తిని ప్రదర్శించిన విషయం తెలిసిందే. తూర్పు తీరంలోని వోన్‌సాన్ నగరంలో జరిగిన ఈ ప్రదర్శనలో ఉత్తరకొరియా అత్యంత భారీ ఫైరింగ్ డ్రిల్‌ను జరిపింది. జపాన్, దక్షిణ కొరియా సైన్యాలతో కవాతులు చేస్తున్న అమెరికాకు ఈ భారీ ఫైరింగ్ డ్రిల్‌తో ఉత్తరకొరియా ఓ హెచ్చరిక జారీ చేసిందని విశ్లేషకుల అంచనా.
ఆ దేశంలో ఇప్పటివరకు జరిపిన ఫైరింగ్ డ్రిల్ లలో ఇదే అత్యంత భారీ ఫైరింగ్. ఈ సందర్భంగా ఉత్తర కొరియా ఆర్మీ ఫోర్స్ మినిస్టర్ పాక్ యాంగ్ సిక్ మాట్లాడుతూ... తమ శత్రుదేశాలకు వార్నింగ్ ఇచ్చారు. శత్రుదేశాలు మిలటరీ దాడులకు పాల్పడితే, తమ సైన్యం వారిని భూమిపై లేకుండా చేస్తుందని అన్నారు. తమ అత్యంత శక్తిమంతమైన అణ్వస్త్రాలు రంగంలోకి దిగి విజయాన్ని ఏకపక్షం చేస్తాయని ఉద్ఘాటించారు.