: అంపైర్ తో వాగ్వివాదానికి దిగిన రోహిత్ శర్మ... జరిమానా
ప్రస్తుతం కొనసాగుతున్న ఐపీఎల్ సీజన్‌లో నిన్న ముంబై ఇండియన్స్ జట్టు, రైజింగ్ పుణెతో మ్యాచు ఆడిన విషయం తెలిసిందే. అయితే, ఆ మ్యాచులో మైదానంలో అంపైర్‌తో వాగ్వాదానికి దిగినందుకు గానూ ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు జరిమానా విధించారు. నిన్నటి మ్యాచ్ లో అంపైర్ ఎస్.రవితో రోహిత్ శర్మ వాదించాడు. పుణె బౌలర్ జయదేవ్ ఉనాద్కత్ వేసిన బంతి వైడ్ వెళ్లినా అంపైర్ రవి ఆ బంతిని వైడ్ గా ప్రకటించలేదు. దీంతో వైడ్ ఇవ్వలేదని రోహిత్ అంపైర్‌ను నిలదీశాడు. దీంతో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించింనందుకు ఆయేనకు మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించారు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లోనూ రోహిత్ శర్మ ఇటువంటి ప్రవర్తనే కనబర్చాడు. సునీల్ నరైన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుటయిన సందర్భంగా అంపైర్ సీకే నందన్ నిర్ణయంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసి మందలింపునకు గురయ్యాడు.