: ఏర్పేడు ప్రమాద ఘటన: అధికారులపై చర్యలు ప్రారంభించిన ఏపీ సర్కారు
చిత్తూరు జిల్లా ఏర్పేడు వద్ద లారీ సృష్టించిన బీభత్సం కారణంగా జరిగిన ప్రాణ నష్టానికి కారణమైన అంశాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ ఘటనకు పరోక్షంగా కారణమైన అధికారులపై వేటు వేస్తోంది. ఏర్పేడు తహసీల్దార్‌ను సస్పెండ్ చేసినట్లు తెలిపింది. మరోవైపు రేణిగుంట రూరల్ సీఐ సాయినాథ్‌ను కూడా బదిలీ చేసింది. అక్కడ జరుగుతున్న ఇసుక రవాణాపై స్థానికులు పలుసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ సదరు తహసీల్దార్, సీఐ చర్యలు తీసుకోలేదు. ఆ ప్రాంతంలో జరుగుతున్న ఇసుక అక్రమార్కులపై ఫిర్యాదు చేసేందుకు స్థానికులు ఏర్పేడు పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన సమయంలోనే ఈ ప్రమాదం జరిగింది.