: రాష్ట్రపతి రేసులో లేను.. నాకు అంత బలం లేదు: శరద్ పవార్


రాష్ట్రపతి పదవికి తాను పోటీ పడటం లేదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పష్టం చేశారు. తమ పార్టీకి కేవలం 14 మంది ఎంపీలు మాత్రమే ఉన్నారని... రాష్ట్రపతి కావడానికి అవసరమైనంత బలం తనకు లేదని చెప్పారు. ఐదు దశాబ్దాలుగా రాజకీయాల్లో కొనసాగుతున్నానని... కేవలం 14 మంది ఎంపీలను మాత్రమే కలిగి ఉన్న నాయకుడు రాష్ట్రపతి కాలేడన్న విషయం తనకు తెలుసని అన్నారు. రాష్ట్రపతి పదవిని కైవసం చేసుకునేంత మెజార్టీ ఎన్డీఏ కూటమికి ఉందని... ప్రధాని నరేంద్ర మోదీ ఇతర పార్టీల నేతలతో కూడా మాట్లాడితే, రాష్ట్రపతిని ఏకగ్రీవంగా ఎన్నుకోవచ్చని సూచించారు. శరద్ పవార్ ను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తే మద్దతిస్తామని శివసేన ప్రకటించిన నేపథ్యంలో... పవార్ ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News