: బాహుబలిపై మరో ట్వీటేసిన రాంగోపాల్ వర్మ
బాహుబలి రెండో భాగం మరో మూడు రోజుల్లో విడుదల కానున్న వేళ, దర్శకుడు రాంగోపాల్ వర్మ, ఈ ఉదయం మరో ట్వీటేశాడు. బాహుబలి-2వ భాగం విడుదలైన తరువాత, దేశంలోని చిత్ర నిర్మాతలు, దర్శకులందరూ తామంతా టీవీ సీరియల్ నిర్మాతలము, దర్శకులమేనని భావించాల్సి వస్తుందని అన్నాడు. ఈ విషయాన్ని తాను బలంగా నమ్ముతున్నానని చెప్పాడు. ఉదయం 9:45 గంటల సమయంలో రాంగోపాల్ వర్మ ఈ ట్వీట్ పెట్టగా, అది నిమిషాల్లోనే వైరల్ అయింది. ఆ ట్వీట్ ను మీరూ చూడండి!
I have a strong feeling @ssrajamouli 's #Bahubali2 will make rest of all film makers in country feel like amateur TV serial directors
— Ram Gopal Varma (@RGVzoomin) April 25, 2017