: తెలంగాణలో బీఎస్ఎన్ఎల్ 4జీ ప్లస్ వైఫై వాణిజ్య సేవలు ప్రారంభం


తెలంగాణలో వాకిన్ కస్టమర్ల (ఇతర నెట్‌వర్క్‌ల వినియోగదారులు) కోసం ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ 4.5జీ వైఫై సేవలను ప్రారంభించింది. ఆ సంస్థ తెలంగాణ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ అనంతరామ్ సోమవారం ఈ సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా 121 హాట్‌స్పాట్ జోన్లు, 925 యాక్సెస్ పాయింట్లను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.

బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ఆస్పత్రులు, బహిరంగ ప్రదేశాల్లో హాట్‌స్పాట్ జోన్లను ఏర్పాటు చేసే బాధ్యతను ఎల్‌ అండ్ టీ సంస్థకు అప్పగించినట్టు తెలిపారు. రెండు నెలల్లో పూర్తి స్థాయిలో వైఫై సేవలు అందించేందుకు ప్రణాళిక రూపొందించినట్టు పేర్కొన్నారు. డేటా వినియోగం కాలపరిమితిని బట్టి రూ.10 నుంచి రూ.599 వరకు మార్కెట్లో రీచార్జ్ వోచర్లు అందుబాటులో ఉంటాయని అనంత్‌రామ్ తెలిపారు. అలాగే వ్యాపార సంస్థలు, బల్క్ వినియోగదారుల కోసం విస్తీర్ణం, యాక్సెస్ పాయింట్లను బట్టి ఏడాదికి రూ.2 లక్షలు, రూ.2.90 లక్షల చొప్పున రెండు ప్లాన్లను కూడా అందుబాటులోకి తెచ్చినట్టు వివరించారు.

  • Loading...

More Telugu News